aatreya-kavitalu.blogspot.com
నా కవితలు: Oct 17, 2010
http://aatreya-kavitalu.blogspot.com/2010_10_17_archive.html
నా కవితలు. Sunday, October 17, 2010. వీడ్కోలు. ఆ వీడ్కోలు క్షణంలో. నిర్వీర్యమయిన నీ ముఖం. నన్ను వెంటాడుతూనే ఉంది. ఎంతో అనుకుంటాను. ఏదో చెయ్యాలని. ఎంతైనా చెయ్యాలని. దూరాలు పెరిగే కొద్దీ. ప్రేమలు ఆప్యాయతలు. ఫోను తంత్రులకు. చెక్కు ముక్కలకే. పరిమితమై పోతున్నాయి. నీ ఒళ్ళొతలపెట్టిన తృప్తి. నా తలపై తిరిగిన నీ చేతి వెచ్చదనం. ఏ చెక్కుతో కొనగలను? ఒద్దనుకున్న క్షణాల్లో. స్థంబించే కాలం. ఇపుడు చిన్నగా నైనా. బరువైన శ్వాసలు. అదిరే చుబుకంతో. తడిసిన పరిసరాల వెనక. నీ ముఖమూ. స్పష్టంగా కనబడదు. ఈ ఒక్క క్షణం. బ్లా...
aatreya-kavitalu.blogspot.com
నా కవితలు: Apr 27, 2010
http://aatreya-kavitalu.blogspot.com/2010_04_27_archive.html
నా కవితలు. Tuesday, April 27, 2010. అయిష్టంగా. పలచ బడ్డ ప్రస్తుతం మీద. వయసునూ అలసటనూ అరగదీస్తూ. బాల్యాన్ని చేరుకున్నాను. పరిసరాలను కమ్మిన. సొంత ఊరు, చిన్నతనపు. కేరింతల మధ్య. నెరిసిన రెప్పకట్టలు తెగి. కళ్ళనుండి పొంగిన పాత కబుర్లు. కాలాన్ని కరిగించి. గెలిచామంటూ గేలి చేశాయి. అయినా. అయిష్టంగా. గుండెనిండిన తృప్తి. కడుపు నిండిన జ్ఞాపకంతో. వాస్తవంలోకి తిరుగు ప్రయాణం. వీరిచే పోస్ట్ చెయ్యబడింది. ఆత్రేయ కొండూరు. లేబుళ్లు: జ్ఞాపకాలు. వృద్ధాప్యం. Subscribe to: Posts (Atom). నా గురించి. View my complete profile.
aatreya-kavitalu.blogspot.com
నా కవితలు: Jun 29, 2010
http://aatreya-kavitalu.blogspot.com/2010_06_29_archive.html
నా కవితలు. Tuesday, June 29, 2010. నెమలి కన్ను. జీవం లేనిదే ఐనా. పాత పుస్తకం పేజీల మధ్య. ప్రత్యక్షం అయినపుడల్లా. ఓ కధ చెపుతుంది . చూపుగాలాలు శూన్యంలో. దేవులాడుతూ మిగిలిపోతాయి. పరిసరాలు ఒక్కసారిగా. పారదర్శకమయిపోతాయి. ఇంతలో ఏదో శబ్దం. ఘనీభవించిన గడియారం. ఒక్క ఉదుటున పరుగెడుతుంది. అసంతృప్తిగా కధ ఆగిపోతుంది. కధ అంతం తెలిసినా. ఎందుకో. ఆ పుస్తకం తెరవాలనిపిస్తుంది. మళ్ళీ ఆ కధ వినాలనిపిస్తుంది. వీరిచే పోస్ట్ చెయ్యబడింది. ఆత్రేయ కొండూరు. లేబుళ్లు: జ్ఞాపకాలు. Subscribe to: Posts (Atom). View my complete profile.
aatreya-kavitalu-e.blogspot.com
naa kavitalu: prakRti
http://aatreya-kavitalu-e.blogspot.com/2010/07/prakrti.html
13, జులై 2010, మంగళవారం. Aaku niiDana cErina puvvu. Published in http:/ poddu.net/? వీరిచే పోస్ట్ చెయ్యబడింది ఆత్రేయ కొండూరు. లేబుళ్లు: poddu. క్రొత్త పోస్ట్. పాత పోస్ట్. నా గురించి. ఆత్రేయ కొండూరు. నా పూర్తి ప్రొఫైల్ను చూడండి. వెదకండి. లోడ్ అవుతోంది. నా బ్లాగు జాబితా. నా కవితలు. కంద కదంబం. శ్రీ రామ నవమి శుభాకాంక్షలు. ప్రోత్సహించువారు. అతిధి దేవో భవ. బ్లాగు ఆర్కైవ్.
aatreya-kavitalu.blogspot.com
నా కవితలు: Apr 22, 2010
http://aatreya-kavitalu.blogspot.com/2010_04_22_archive.html
నా కవితలు. Thursday, April 22, 2010. ఒకటే వాన. బరువుతగ్గిన ఆకాశం. చినుకుల మధ్యగా. ఆటలాడుతూ చిరుగాలి. గుప్పుమంటూ. గుంటలు నింపుకున్న నేల. తలదాచుకునే ఆరాటంలో. పడుచుదనం పట్టించుకోని పాఠం. పల్లానికి పరుగెట్టి. చిన్నారుల కాళ్ళక్రింద చిందులవుతూ. తాత చేతిపై జ్ఞాపకమవుతూ. చూరుక్రిందా తడిసిన తలల. తలపుల్లో గుబులు ఒలకపోస్తూ. ఒకటే వాన. వీరిచే పోస్ట్ చెయ్యబడింది. ఆత్రేయ కొండూరు. లేబుళ్లు: భావాలు. Subscribe to: Posts (Atom). నా గురించి. ఆత్రేయ కొండూరు. View my complete profile. వెదకండి. కంద కదంబం.
aatreya-kavitalu.blogspot.com
నా కవితలు: Aug 9, 2010
http://aatreya-kavitalu.blogspot.com/2010_08_09_archive.html
నా కవితలు. Monday, August 9, 2010. మైనపు రెక్కలు. గమ్యం ఎక్కడో శిఖరాలమీద. ఉద్భవిస్తుంది,. పడిలేస్తున్న ప్రాణానికి దర్పణంగా. పెదవి విరుస్తూ. సామూహిక నిస్సహాయతకు. సాక్ష్యమన్నట్టు. వికటాట్టహాసం చేస్తూ. వాడి ప్రశ్నల వాలుమీద. ఆత్మావలోకనమే ప్రయాణం. ఆ నవ్వులు ముల్లుకర్రలు. ప్రతికూడలిలోనూ. గుచ్చుతూ. ప్రత్యామ్నాయం దొరికేలోపే. మైనపు రెక్కలు కరిగి. ఆత్మ విమర్శై పలుకరిస్తుంది. ఈ చిత్రం www.thecreativecreative.com నుండి తీసుకొనబడినది. P=4942 లోకుఉడా కూడగలరు. ఆత్రేయ కొండూరు. Subscribe to: Posts (Atom).
aatreya-kavitalu.blogspot.com
నా కవితలు: Feb 17, 2010
http://aatreya-kavitalu.blogspot.com/2010_02_17_archive.html
నా కవితలు. Wednesday, February 17, 2010. తృప్తి. తడి మెరుపులుల్లో. కరిగిన చూపులు . ఉరుము ధ్వనుల్లో. మమైకమైన మౌనం . జడివాన జల్లుల్లో. జోరు గాలుల్లో. వాడిన రెక్కమందారాలు. ఎర్రబారిన చందమామను. ఎదలోతుల్లో గుచ్చేసరికి. ఏడడుగులు నడిచిన తృప్తి. వెచ్చగా తాకింది. గుండెలపైన మరో రాత్రి. బద్ధకంగా అస్తమించింది. వీరిచే పోస్ట్ చెయ్యబడింది. ఆత్రేయ కొండూరు. లేబుళ్లు: ప్రకృతి. శృంగారం. Subscribe to: Posts (Atom). నా గురించి. ఆత్రేయ కొండూరు. View my complete profile. వెదకండి. కంద కదంబం. There was an error in this gadget.
aatreya-kavitalu.blogspot.com
నా కవితలు: Sep 14, 2010
http://aatreya-kavitalu.blogspot.com/2010_09_14_archive.html
నా కవితలు. Tuesday, September 14, 2010. నిశ్శబ్ద పుష్పం. నిశిరాతిరి. మాలిణ్యాలను కరిగిస్తోంది. వెచ్చని అశక్తత. మంద్రంగా వీస్తోంది. అసంకల్పితంగా వికసించింది. ఓ నిశ్శబ్ద పుష్పం. గంధరహిత పుప్పొళ్ళను. గుండెలనిండా పులుముతూ. తనువునూపుతూ. స్వరరహిత గీతంతో. మనసును తాకుతూ. మూసిన రెప్పల వెనక. కరిగిన కాలం. మిణుగురులవుతుంది. రేపటి ఆశ లేదు. ఈ నిశి రాతిరే శుభోదయం. వీరిచే పోస్ట్ చెయ్యబడింది. ఆత్రేయ కొండూరు. లేబుళ్లు: జీవితం. భావాలు. Subscribe to: Posts (Atom). నా గురించి. View my complete profile.
aatreya-kavitalu.blogspot.com
నా కవితలు: Jul 20, 2010
http://aatreya-kavitalu.blogspot.com/2010_07_20_archive.html
నా కవితలు. Tuesday, July 20, 2010. తలపు తడుతూ నేల గంధం. తలుపు తీస్తే. ఆకాశం కప్పుకున్న. అస్థిరమయిన రూపాలు. తేలిపోతూ. కరిగిపోతూ . అలజడిచేస్తూ. అక్షరాల జల్లు. నిలిచే సమయమేది? పట్టే ఒడుపేది? పల్లంలో దాగిన. జ్ఞాపకాల వైపు ఒకటే పరుగు. తడుపుదామనో. కలిసి తరిద్దామనో. గుండె నిండేసరికి. నిర్మలాకాశం. వెచ్చగా మెరిసింది. పొద్దు లో ప్రచురించబడినది http:/ poddu.net/? వీరిచే పోస్ట్ చెయ్యబడింది. ఆత్రేయ కొండూరు. లేబుళ్లు: పొద్దు. భావాలు. Subscribe to: Posts (Atom). నా గురించి. View my complete profile.
aatreya-kavitalu.blogspot.com
నా కవితలు: Aug 17, 2010
http://aatreya-kavitalu.blogspot.com/2010_08_17_archive.html
నా కవితలు. Tuesday, August 17, 2010. మరోప్రశ్న. తెరలు తెరలుగా. అవే ప్రశ్నలు. అలలవుతూ. మనిద్దరి మధ్య. నన్ను శోధిస్తాను. నిన్ను ప్రశ్నిస్తాను. తెలుసుకునే లోపే. మరోప్రశ్న . తెలుసనుకున్న దాన్ని. తిరిగి ప్రశ్నిస్తూ. వృత్తంలా పరిచుంచిన. పట్టాల మధ్య, ఇది,. ముడులు విప్పుకుంటూ. గుంటలు పూడ్చుకుంటూ. పరుగనిపిస్తుంది . మనమధ్య దూరమిక. లేదనిపిస్తుంది. నీ అస్థిత్వాన్నీ,. నా విశ్వాసాన్ని. ప్రశ్నిస్తూ. మరో నెర్ర. అతుకుల చక్రం సాగుతుంది. మరో అతుకుని ఆహ్వానిస్తూ. ఆత్రేయ కొండూరు. భావాలు. Subscribe to: Posts (Atom).